Home  »  TV News  »  Brahmamudi:  రేఖ రహస్యం రాజు చేతిలో.. రిపోర్టులు చింపేసినా తప్పని షాక్!

Updated : Aug 23, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి(Brahmamudi)'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-1118లో..  భ్రమరం చేతిలో ఉన్న కాగితాలు డీఎన్ఏ రిపోర్టులేమోనని రేఖ మొదట కంగారుపడుతుంది. కానీ అవి శేషు లెక్కల గురించి అని తెలిసి ఊపిరి పీల్చుకుంటుంది. అయితే రాజు మాత్రం రేఖను ఆట పట్టిస్తూ.. నీ రిపోర్టులు ఎవరికి తెలిస్తే నువ్వు షాక్ అవుతావో వాళ్ల దగ్గరే పెట్టానని రాజు అంటాడు. వెంటనే రేఖ.. లక్కీ దగ్గరా అని కంగారుపడుతుంది. దానికి రాజు.. నీ కన్న కొడుకు లక్కీ అని అందరి ముందు ఒప్పుకుంటే ఈ బాధే ఉండదు కదా అని అంటాడు. రేఖ పరుగెత్తుకుంటూ వెళ్లి రిపోర్టులను దొరికించుకుని చింపేస్తుంది. కానీ రాజు.. ఇది సాఫ్ట్ కాపీ.. నా మెయిల్‌లో ఉంది. వంద జిరాక్స్‌లు తీసి ఇంట్లో పరిస్తే ఏం చేస్తావంటూ ఆమెకు మరో షాక్ ఇస్తాడు.

రేఖ భయంతో మెట్లపై కూర్చుని ఉండగా అపర్ణ వచ్చి గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది. కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు. ఒకప్పుడు నువ్వు ఇందుని ఇలాగే పరుగులు పెట్టించావ్.. ఇప్పుడు నా మనవడు నిన్ను అలాగే పరుగులు పెట్టిస్తున్నాడని అపర్ణ అంటుంది. రేఖ కోపంగా స్పందించినా, అపర్ణ మాత్రం .. నీ పాపం పండింది. నువ్వు చేసిన ప్రతి పనికి గుణపాఠం తప్పదు. అనుభవించకపోతే అనుభవించేలా చేస్తాడు నా మనవడు అని చెప్పేసి వెళ్లిపోతుంది. దీంతో రాజు చేతిలో రేఖ రహస్యం బయటపడబోతుందనే టెన్షన్ మరింత పెరుగుతుంది. మరోవైపు రాజు, ఇందు కలిసి సుభాష్ ఆపరేషన్ రిపోర్టుల కోసం హాస్పిటల్‌కు వెళ్తారు. అన్ని రిపోర్టులు చూసిన డాక్టర్.. గుడ్ న్యూస్.. నరాలకు ఎలాంటి సమస్య లేదు. ఆపరేషన్ చేస్తే బాగవుతారు. కానీ తర్వాత ఫిజియోథెరపీ, చిన్నపిల్లాడిలా ప్రత్యేక శ్రద్ధ అవసరమని చెప్తాడు. ఇందు వెంటనే.. మా తాతయ్య కోసం ఏమైనా చేస్తాను డాక్టర్ అంటుంది. రాజు కూడా.. డాక్టర్ చికిత్సతో పాటు నీ ప్రేమ కూడా తాతయ్యను మళ్లీ నడిచేలా చేస్తుందంటూ ఇందుకు ధైర్యం చెప్తాడు.

ఇక ఇంట్లో గ్రాండ్ పార్టీ చేయాలని ఐశ్వర్య తన ఫ్రెండ్స్‌ను పిలుస్తుంది. డబ్బులు, ఏర్పాట్ల కోసం అపర్ణను అడిగినా ఆమె దగ్గర లేవని చెప్పడంతో శశికి ఫోన్ చేసి పార్టీ ఏర్పాట్లు చేయిస్తుంది. నా రేంజ్ ఏంటో చూశావా అంటూ ఐశ్వర్య హంగామా చేస్తుంది. అపర్ణ, రేఖ, శేషులు మొన్నే గొడవ జరిగింది.. మళ్లీ ఇందుతో సమస్య రావచ్చని చెప్పినా.. ఐశ్వర్య మాత్రం.. ఇప్పుడు వెనక్కి తగ్గితే ఇందుకు భయపడ్డానని అనుకుంటారు. ఈ పార్టీ కచ్చితంగా చేసుకుంటానంటూ మొండిగా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

Brahmamudi Today Episode,  Brahmamudi Serial Today Episode August 22 2026, Brahmamudi Episode 1118, Brahmamudi Star Maa Serial Latest Episode, Brahmamudi Rekha DNA Reports






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.